ఖమ్మం: అగ్రికల్చరల్ మినిస్ట్రీయల్ స్టాప్ అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. యర్రమళ్ల శ్రీనివాసరావు ఈ ఎన్నికలకు ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ముఖ్య అతిథిలుగా టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్ష్యకార్యదర్శులు షేక్ అష్టల్హాసన్, ఆర్వీ సాగర్లు హాజరయ్యారు. ఈ సందర్బంగా వ్యవసాయశాఖ ఉద్యోగులు అధ్యక్షులుగా చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా బంగారయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
వీరితో పాటు వైస్ ప్రెసిడెంట్గా లక్ష్మీ, జాయింట్ సెక్రటరీగా ఎస్ రాధిక, కోశాధికారిగా రాము, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రాము, ప్రచారకార్యదర్శిగా మధుసుధన్, ఎగ్జిక్యూటీవ్ మెంబర్లుగా శాంత, ఏడీ హబీబుద్దీన్లను ఎన్నుకున్నారు. ఎన్నికైన బాధ్యులకు అసోసియేషన్ నాయకులు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం జిల్లా బాధ్యులను నూతన కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్య్రమంలో టీఎన్జీఓస్ నాయకులు నందగిరి శ్రీను, కోశాధికారి పవన్, సామినేని రఘు, ఎండీ ముజీద్ తదితరులు పాల్గొన్నారు.