మధిర, జూలై 31 : రైతులు సహకార సంఘాల ద్వారా తీసుకున్న రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సిద్ధినేనిగూడెం సహకార సంఘం చైర్మన్ కటికల సీతారామరెడ్డి అన్నారు. గురువారం సిద్దినేనిగూడెం సహకార సంఘంలో రైతులకు నూతనంగా రుణాలను మంజూరు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతాంగం సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. సహకార సంఘాల ద్వారా తీసుకున్నటువంటి రుణాలను సకాలంలో చెల్లించి, సంఘం అభివృద్ధికి తోడ్పడు అందించాలని కోరారు. సంఘం పరిధిలో 65 మంది రైతులకు కొత్తగా రూ.50 లక్షలు మంజూరవగా వాటిని రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ మధిర ఫీల్డ్ ఆఫీసర్ గోపిరెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ శాంతి, విజయ, యశస్విని, సొసైటీ సిబ్బంది కృష్ణారెడ్డి పాల్గొన్నారు.