కారేపల్లి : సింగరేణి సీఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎన్.సాగర్ను ఆదివాసీ నాయకులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కారేపల్లిలోని సర్కిల్ కార్యాలయంలో సీఐ సాగర్ను కలిసిన నాయకులు ఆయనను సన్మానించారు. మండలంలో శాంతి భద్రతలు, ప్రజాసేవలు, పోలీసులు చేపట్టుతున్న అభివృద్ధి పనులపై చర్చించారు. మండలంలో ఎలాంటి సమస్య వచ్చినా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా సమన్వయంతో ముందుకు వెళ్తామని సీఐ నాయకులకు వివరించారు. సీఐని కలిసివారిలో ఎర్రబోడు మాజీ సర్పంచ్ కుర్సం సత్యనారాయణ, సీనియర్ నాయకులు కరపాటి సీతారాములు, పొలంపల్లి, కారేపల్లి మాజీ ఉప సర్పంచ్లు ముక్తి కోటేశ్వరరావు, పులసం భద్రం, నాయకులు సోది కోటేశ్వరరావు, పొడుగు హరీష తదితరులు పాల్గొన్నారు.