Election Officers | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యుల రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం ఆర్ఓ, ఏఆర్ఓలకు బుధవారం కలెక్టరేట్లో శిక్షణ జరిగింది. వారికి జిల్లా అడిషనల్ కలెక్టర్ డి వేణుగోపాల్, జిల్లా ఎన్నికల శిక్షణా తరగతుల నోడల్ అధికారి బి శ్రీరామ్ పర్యవేక్షణలో దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపముఖ్య కార్య నిర్వహణ అధికారి కె చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఎన్నికల విధులను బాధ్యతాయుతంగా స్వీకరించి రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించిన ఎన్నికల నిర్వహణ మార్గదర్శకాలను తుచ తప్పకుండా పాటిస్తూ ఎటువంటి వర్గ విభేదాలకు, పక్షపాత ధోరణికి తావివ్వకుండా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియను విజయవంతముగా పూర్తిచేయాలని సూచించారు.
ఈ శిక్షణలో పాల్గొన్న 208 మంది ఆర్ఓ, ఎఆర్ఓలకు హైదరాబాద్లో శిక్షణ పొందవచ్చని 10 మంది మాస్టర్ ట్రైనీస్ అంశాల వారీగా ఎన్నికల విధివిధానాలను, మార్గదర్శకాలను వివరించారు.
Hyderabad | మూసీ పరిసరాల్లో మళ్లీ కూల్చివేతలు.. భయాందోళనలో జనం
Mythological Drama Competitions | పౌరాణిక నాటక పోటీలకు బ్రోచర్ ఆవిష్కరణ