తిరుమలాయపాలెం, జూన్ 20 : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని అదనపు కలెక్టర్ డాక్టర్ శ్రీజ ఆదేశించారు. మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం ఆమె ఆకస్మికంగా పర్యటించారు. ఏలువారిగూడెం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం రావిచెట్టుతండా సమీపంలోని ఆకేరు ఇసుక రీచ్‌లను సందర్శించారు.
ఈ సందర్భంగా అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక కూపన్లు సకాలంలో జారీ చేయాలని ఆదేశించారు. ఇసుక రీచ్‌ల వద్ద స్వయం సహాయక సంఘాల మహిళలచే ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయించాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో షేక్ శిలార్ సాహెబ్, తహసీల్దార్ లూథర్ విల్సన్, ఏవో నారెడ్డి సీతారామరెడ్డి, ఎంపీవో సూర్యనారాయణ. ఆర్ఐ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.