కారేపల్లి, డిసెంబర్ 04 : ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో కొనసాగుతున్న రెండో విడత నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఖమ్మం అదనపు కలెక్టర్ శ్రీజ గురువారం పరిశీలించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలు, నామినేషన్ దరఖాస్తుల స్వీకరణ విధానాన్ని ఆమె సమీక్షించారు. నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా, దరఖాస్తుదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించేందుకు అవసరమైన సలహాలు, సూచనలు అధికారులు, సంబంధిత సిబ్బందికి ఇచ్చారు. అదనపు కలెక్టర్ వెంట ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ రవీంద్ర ప్రసాద్, గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి ఉన్నారు.