రఘునాథపాలెం, జూన్ 24 : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న అభిషేక్ అగస్త్యను ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా 2021, అక్టోబర్ 20వ తేదీ నుంచి పని చేసిన ఆదర్శ్ సురభిని వనపర్తి జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేసిన విషయం విదితమే. ఆయన స్థానంలో ప్రభుత్వం అభిషేక్ అగస్త్యను కమిషనర్‌గా నియమించింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని జమ్మూ జిల్లా ఆర్ఎస్ పురానికి చెందిన అగస్త్య.. అక్కడే ప్రాథమిక, ఉన్నత విద్యను పూర్తి చేశారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్‌ను శ్రీనగర్ ఐఐటీలో పూర్తి చేశారు. సోదరుడు ఐఎఫ్ఎస్ అధికారి సర్జిత్ స్పూర్తితో సివిల్స్‌కు ప్రిపేర్ అయి 2018 సంవత్సరంలో అభిల భారత స్థాయిలో 38వ ర్యాంకు సాధించారు. శిక్షణ అనంతరం తెలంగాణ క్యాడర్‌కు కేటాయించగా.. మేడ్చల్ మల్కాజ్గిరి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పని చేశారు. తల్లిదండ్రులు విద్యా వృత్తిలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీపై రానున్నారు.