అశ్వారావుపేట టౌన్, జూన్ 3 : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం.. సకల జనుల ఉద్యమం.. ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా సోమవారం స్థానిక రింగ్ రోడ్డులోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అమరవీరులకు నివాళులర్పించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలోని రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ పోరాటాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దశాబ్ది వేడుకలను కాంగ్రెస్ ప్రభుత్వం మొక్కుబడిగా నిర్వహించిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అమరవీరుల కుటుంబాలను పిలిపించి ఓ మూలన కూర్చోబెడితే.. మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్లో 20 వేల మందితో వేడుకలు నిర్వహించి .. అమరవీరుల కుటుంబాలతో కలిసి భోజనం చేసి వారి బాగోగులు తెలుసుకున్నారన్నారు. వారి కుటుంబాలకు రూ.24 లక్షల చెక్కు అందించిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు. అశ్వారావుపేటలో ఎమ్మెల్యే ఎవరో తెలియదని, అందుకు నిదర్శనమే కాంగ్రెస్ నాయకులు జాతీయ జెండా ఎగురవేయడమన్నారు. అసలు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉన్నాడా.. లేడా.. అనే విధంగా పాలన ఉన్నదని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు యూఎస్ ప్రకాశ్, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, పట్టణ అధ్యక్షుడు సత్యవరపు సంపూర్ణ, మందపాటి రాజమోహన్‌రెడ్డి, డాక్టర్ భూక్యా ప్రసాదరావు, కలపాల దుర్గయ్య, చిప్పనపల్లి బజారయ్య, కుమారస్వామి, కోటి, ఆరేపల్లి గోవిందు, చరణ్, కలపాల దుర్గయ్య, బుచ్చిబాబు, సురేశ్, శ్రీరామ్మూర్తి, మోహన్, గొడవర్తి వెంకటేశ్వరావు, చిప్పనపల్లి శ్రీను, తాళం సూరి పాల్గొన్నారు.