కారేపల్లి, ఫిబ్రవరి 9 : ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండలం విశ్వనాథపల్లి గ్రామపంచాయతీ లింగం బంజరలో గల పురాతన శివాలయానికి సంబంధించిన స్థలానికి హద్దులు గుర్తించాలని కోరుతూ లింగం బంజర గ్రామస్తులు సోమవారం ప్రజావాణిలో తహసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అధికారిక రికార్డుల ప్రకారం శివాలయానికి 3.08 ఎకరాల భూమి ఉన్నట్లు వినతి పత్రంలో పేర్కొన్నారు. ప్రస్తుతం శివాలయం 10 గుంటలలోనే ఉందని మిగతా స్థలానికి సర్వే నిర్వహించి హద్దులు నిర్వహించాలని అధికారులను కోరారు.
విశ్వనాధపల్లి రెవెన్యూలో గల సర్వేనెంబర్ 362/10లోని 11.33 ఎకరాలలో శివాలయం భూమి ఉందని వారు చెప్పారు. అధికారులు త్వరితగతిన సర్వే చేసి శివాలయ భూమికి హద్దులు గుర్తించాలన్నారు. వినతి పత్రం అందజేసిన వారిలో లింగంబంజర గ్రామస్తులు పురం అంజయ్య, బడుగుల శ్రీను, మొగిలిచర్ల రాంబాబు, పురం రామరాజు తదితరులు ఉన్నారు.