ఖమ్మం, జనవరి 26: బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్ 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు ముఖ్య అతిధిగా పాల్గొని మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేశారు. జిల్లా ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, కేఎంసీ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పగడాల నాగరాజు, బెల్లం వేణుగోపాల్, అజ్మీరా వీరూనాయక్, మక్బుల్, తోట రామారావు, శీలంశెట్టి రమాదేవి వీరభశద్రం, దాదె అమృత, మాటేటి నాగేశ్వరరావు, బుర్రి వెంకట్, విజయలక్ష్మి, నాయకులు తాజుద్దీన్, ఉప్పల వెంకటరమణ, తాళ్లూరి జీవన్‌కుమార్, ఇంటూరి శేఖర్, కొల్లు పద్మ, పగడాల నరేందర్, కాట్రాల శ్రీరాములు, ఈదుల రాజేశ్, సద్దాం తదితరులు పాల్గొన్నారు.