సత్తుపల్లి/ పెనుబల్లి, ఫిబ్రవరి 14: సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి రూ.54 కోట్ల డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (డీఎంఎఫ్టీ) నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గ్రామాల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, మెటల్ రోడ్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాల కోసం తన విజ్ఞప్తి మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించి డీఎంఎఫ్టీ నుంచి రూ.54 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు సత్తుపల్లిలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ఏయే గ్రామాలకు ఎంతెంత నిధులు మంజూరయ్యాయో వివరించారు. సత్తుపల్లి మండలంలోని గ్రామాల్లో 36 సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ.1.50 కోట్లతోపాటు తుంబూరు, బేతుపల్లి, నారాయణపురం, రేజర్ల, సదాశివునిపాలెం, కాకర్లపల్లి, రుద్రాక్షపల్లి, బుగ్గపాడు, సిద్ధారం, రామానగరం, గంగారం గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలకు రూ.2.75 కోట్లు మంజూరైనట్లు చెప్పారు.
వేంసూరు మండలంలో 41 సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.1.79 కోట్లతోపాటు దుద్దేపూడి, భరణిపాడు, కందుకూరు, వెంకటాపురం, లచ్చన్నగూడెం, మర్లపాడు, వేంసూరు, రామన్నపాలెం, బీరాపల్లి, లింగపాలెం, భీమవరం, కుంచపర్తి, అడసర్లపాడు, అడసర్లపాడు-2 గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలకు రూ.3.65 కోట్లు మంజూరైనట్లు వివరించారు. పెనుబల్లి మండలంలో 62 సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ.2.93 కోట్లతోపాటు గౌరారం, ఏరుగట్ల, గణేశ్పాడు, పెనుబల్లి, చింతగూడెం, మండాలపాడు, లంకపల్లి, టేకులపల్లి, గంగదేవిపాడు, కోండ్రుపాడు, పాత కుప్పెనకుంట్ల, లింగగూడెం, లంకపల్లి గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలకు రూ.2.95 కోట్లు మంజూరైనట్లు చెప్పారు. కల్లూరు మండలంలో 85 సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ.3.99 కోట్లతోపాటు కల్లూరు అంబేద్కర్‌నగర్, కల్లూరు రామనగర్, పేరువంచ, చండ్రుపట్ల, లింగాల, ఎర్రబోయినపల్లి, చెన్నూరు, చెన్నూరు-2, పెద్దకోరుకొండి, చిన్నకోరుకొండి, వెంకటాపురం, యజ్ఞనారాయణపురం, ముచ్చవరం, వెన్నవల్లి, హనుమాతండా, కప్పలబంధం గ్రామాల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలకు రూ.4.50 కోట్లు మంజూరయ్యాయన్నారు.
తల్లాడ మండలంలో 49 సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ.2.15 కోట్లతోపాటు గొల్లగూడెం, పినపాక, పినపాక బీసీ, పినపాక ఎస్సీ, తల్లాడ, నారాయణపురం, మల్లవరం, కలకొడిమ, ముద్దునూరు, కుర్నవల్లి, నూతనకల్, మిట్టపల్లి, తల్లాడ బీసీలకు రూ.3 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. కల్లూరు మండలంలోని లింగాల నుంచి చెన్నూరు మీదుగా పాత ఎర్రబోయినపల్లికి రూ.4 కోట్లు, వేంసూరు మండలంలో మర్లపాడు నుంచి అమ్మపాలెం బీటీ రోడ్డుకు రూ.4 కోట్లు, తల్లాడ మండలంలోని మంగాపురం నుంచి నారాయణపురం వరకు బీటీ రోడ్డుకు రూ.2.80 కోట్లు, కుర్నవల్లి నుంచి పుణ్యవరం వరకు రూ.2.10 కోట్లు, పెద్దకోరుకొండి నుంచి పోచవరానికి రూ.2 కోట్ల నిధులు మంజూరైనట్లు వివరించారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో స్టేడియం నిర్మాణానికి రూ.5 కోట్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ.3 కోట్లు మంజూరైనట్లు తెలిపారు.