కారేపల్లి, మార్చి 23 : ఖమ్మం జిల్లా సింగరేణి మండలానికి ఎంపీ నిధులతో నాలుగు బోర్వెల్ పంపులు మంజూరు అయినట్లు కాంగ్రెస్ ఖమ్మం జిల్లా నాయకుడు ఇమ్మడి తిరుపతిరావు తెలిపారు. మండల కేంద్రంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేసవి కాలంలో గ్రామాలలో తాగునీటి సమస్యను తీర్చేందుకు మాదారం, గుంపెల్లగూడెం, పేరుపల్లి, చిన్న మడింపల్లి గ్రామ పంచాయతీలలో బోరు పంపులు మంజూరు చేయాలని ఇటీవల ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డిని కోరగా స్పందించిన ఎంపీ బోర్‌వెల్స్‌కు నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. దీంతో ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులు రూపులా నాయక్, వీరబాబు, ఉమా, వీరభద్రం ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు.