ఖమ్మం ఎడ్యుకేషన్, మే 21 : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 3వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు డీఈవో సోమశేఖర శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. పరీక్ష ఫీజు చెల్లించని వారు రూ.50 ఆలస్య రుసుముతో పరీక్ష తేదీ రెండు రోజుల ముందు వరకు చెల్లించే వెసులుబాటు కల్పించారని పేర్కొన్నారు.
జిల్లాలో ఇంటర్మీడియట్ ఎంఎల్టీ ఒకేషనల్ కోర్సులో మార్చి 2019 నుంచి ఉత్తీర్ణులైన విద్యార్థులు క్లినికల్ శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి కె.రవిబాబు ఒక ప్రకటనలో తెలిపారు. శిక్షణకు ఎంపికైన విద్యార్థులు రూ.వెయ్యి చొప్పున ఆస్పత్రి పేరుపై డీడీ తీసి డీఐఈవో కార్యాలయంలో జూన్ ఒకటో తేదీలోగా సమర్పించాలని పేర్కొన్నారు.