
సెప్టెంబర్ 2 నుంచి టీఆర్ఎస్ నూతన కమిటీలు
ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
మణుగూరు రూరల్, ఆగస్టు 30: గ్రామ, బూత్, మండల స్థాయుల్లో నూతన కమిటీలను ఏర్పాటు చేసి పార్టీ పటిష్టతను పెంచేందుకు కృషి చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు. నియోజకవర్గ ముఖ్య నాయకులతో పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కమిటీలు వేసి రెండేళ్లు దాటిన నేపథ్యంలో నూతన కమిటీలను నియమించనున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 2న ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోని 118 గ్రామాల్లో జెండా పండుగను ఘనంగా నిర్వహించాలన్నారు. గ్రామ, వార్డు కమిటీల ఏర్పాటు ప్రక్రియ సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభమై 12 లోపు ముగియాలని అన్నారు. 20వ తేదీ లోపు మండల కమిటీలనూ పూర్తి చేయాలన్నారు. కమిటీల్లో మహిళలతోపాటు డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఆయా మండలాల అధ్యక్షులు రమణారెడ్డి, ముత్యంబాబు, అడపా అప్పారావు, కోడి అమరేందర్, పగడాల సతీశ్‌రెడ్డి, రావుల సోమయ్య, పాయం నర్సింహారావు, వీరస్వామి, జగదీశ్ నాయకులు పొనుగోటి భద్రయ్య, కుర్రి నాగేశ్వరరావు, తాళ్లపల్లి యాదగిరిగౌడ్, కేవీరావు, బొలిశెట్టి నవీన్, హర్షనాయుడు, రుద్ర వెంకట్ పాల్గొన్నారు.