
టార్గెట్ వందశాతం కొవిడ్ టీకా
ఖమ్మం జిల్లాలో 8.30 లక్షల మందికి ఫస్ట్ డోస్
ఇంటింటికీ వెళ్లి టీకా వేస్తున్న వైద్య సిబ్బంది
రెండో డోస్‌పై దృష్టి సారించిన జిల్లా వైద్యారోగ్యశాఖ
ఖమ్మం సిటీ, అక్టోబర్ 29 : ‘కొవిడ్ థర్డ్ వేవ్ పొంచి ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది. జిల్లా వైద్యారోగ్యశాఖ, పంచాయతీరాజ్, ఐసీడీఎస్, ఐకేపీ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అందరికీ టీకా వేసేలా కృషి చేస్తున్నారు. వైద్యసిబ్బంది ఖమ్మం నగరంతోపాటు మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జనాభా వివరాలను సేకరించారు. జిల్లా వ్యాప్తంగా జనాభా 15,59,973 ఉండగా.. వీరిలో 18 ఏండ్లు నిండినవారు 10,60,576 మంది ఉన్నారని గుర్తించారు. వీరిలో 8.30 లక్షల మందికి ఫస్ట్ డోస్ టీకా ఇచ్చారు. ఇప్పటి వరకు 2,78,346 మందికి సెకండ్ డోస్ వేశారు. ఒక్క డోస్ కూడా టీకా తీసుకోని వారు కేవలం 2.30 లక్షల మంది మాత్రమే ఉన్నారు. వీరందరికీ వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి టీకా వేస్తున్నారు.
కరోనా మూడో వేవ్ ముప్పు ఉండే అవకాశం ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే దానిని తిప్పికొట్టడానికి తెలంగాణ ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ను బ్రహ్మాస్త్రంగా చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా కొవిడ్ వ్యాక్సినేషన్ చేపడుతున్నది. పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతిఒక్కరికీ వ్యాక్సినేషన్ అందేలా వైద్యోరోగ్యశాఖ చర్యలు తీసుకుంటున్నది. కలెక్టర్ వీపీ గౌతమ్ పర్యవేక్షణలో వైద్యసిబ్బంది వ్యాక్సినేషన్‌ను వేగిరం చేశారు. ఇప్పటికే 80శాతం మందికి ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చారు.
శరవేగంగా వ్యాక్సినేషన్..
వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించిన జిల్లా వైద్యారోగ్యశాఖ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. తొలుత వైద్యసిబ్బంది ఖమ్మం నగరంతో పాటు మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జనాభా వివరాలను సేకరించారు. మొత్తం జనాభా 15,59,973 ఉండగా వీరిలో 18 ఏండ్లు నిండిన వారు 10,60,576 మంది ఉన్నారని గుర్తించారు. వీరిలో 8.30 లక్షల మంది ఫస్ట్ డోస్ టీకా ఇచ్చారు. ఇప్పటివరకు 2,78,346 మందికి సెకండ్ డోస్ అందడం విశేషం. ఇప్పటి వరకు ఒక్క డోస్ కూడా టీకా తీసుకోని వారు కేవలం 2.30 లక్షల మంది మాత్రమే ఉండడం గమనార్హం. వీరిలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ వాటికి ఇతర మందులు వాడుతున్నవారే ఎక్కువ. వారికి టీకా ఇవ్వడానికి వైద్యులు, సర్పంచ్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ సిబ్బంది ఇంటింటికీ వెళ్తున్నారు.
ఇంటింటికీ టీకా..
వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి వైద్యసిబ్బంది టీకాలను అర్బన్ హెల్త్ సెంటర్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలల్లో ఇచ్చారు. ఆ తర్వాత జనాభాను దృష్టిలో పెట్టుకుని మరికొన్ని అదనపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కారణంగా 80 శాతం మందికి టీకా అందింది. ప్రస్తుతం ఫస్ట్ డోస్ వేసుకోని వారిని గుర్తించి వైద్యసిబ్బంది ఎక్కడికక్కడ టీకా ఇస్తున్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ, పంచాయతీరాజ్, ఐసీడీఎస్, ఐకేపీ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ అందరికీ టీకా అందేలా కృషి చేస్తున్నాయి. టీకా వేసుకోని వారిని గుర్తించడానికి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. వ్యాక్సినేషన్‌ను కలెక్టర్ వీపీ గౌతమ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సెషన్ల వారీగా వివరాలు సేకరిస్తూ యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తున్నారు. రెండో డోస్‌పైనా దృష్టి సారించి టీకా కార్యక్రమాలు చేపడుతున్నారు.
టీకా శ్రీరామరక్ష
కరోనా పూర్తిస్థాయిలో తగ్గలేదు. మూడో వేవ్ ముప్పు నుంచి బయటపడాలంటే ప్రతిఒక్కరూ విధిగా టీకాలు తీసుకోవాలి. లేనిపోని అపోహలతో తప్పించుకుని తిరిగితే సమాజానికి ద్రోహం చేసినట్లవుతుంది. మంచానికే పరిమితమైన వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక రోగాలతో బాధలు పడుతున్న వారి కోసం ఇంటింటికీ టీకా కార్యక్రమం ప్రారంభించాం. త్వరలో జిల్లాలో 100 శాతం వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని సాధిస్తాం.
-డాక్టర్ బి.మాలతి, డీఎంహెచ్‌వో, ఖమ్మం