ఖమ్మం రూరల్/ కూసుమంచి/ కూసుమంచి రూరల్/ నేలకొండపల్లి/ తిరుమలాయపాలెం/ బోనకల్లు/ చింతకాని/ ఎర్రుపాలెం, జనవరి 20: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోంది. ఈ శిబిరాల్లో రెండో రోజు శుక్రవారమూ జనం కిటకిటలాడారు. చింతకాని మండలం వందనం, గాంధీనగర్ కేంద్రాలను అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి తనిఖీ చేశారు. ఖమ్మం రూరల్ మండలంలోని కేంద్రాలను డీఎంహెచ్‌వో డాక్టర్ మాలతి సందర్శించారు.
ఇక్కడ తొలి రోజు 421 మందికి, రెండో రోజు 363 మందికి కలిపి మొత్తం 784 మందికి కంటి పరీక్షలు చేశారు. కూసుమంచి మండలంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాలను పాలేరు నియోజకవర్గ ప్రోగ్రాం ఇన్చార్జి డాక్టర్ బీ.సైదులు పరిశీలించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడు నలగాటి సుధాకర్‌రావు ఆధ్వర్యంలో కూసుమంచి మండలం భగత్‌వీడు, నేలపట్ల, అగ్రహారం, గంగబండతండా గ్రామాల్లో కళాజాతా ప్రదర్శనలు నిర్వహించారు. నేలకొండపల్లి, బోదులబండ గ్రామాల్లోని కంటి వెలుగు శిబిరాన్ని వైద్యాధికారి డాక్టర్ శ్రావణ్‌కుమార్, తిరుమలాయపాలెం కేశ్వాపురం శిబిరాన్ని ఎంపీపీ బోడ మంగీలాల్, బోనకల్లు మండలం రామాపురం, గార్లపాడు శిబిరాలను స్పెషల్ ఆఫీసర్ ఉషారాణి, ఎంపీడీవో బోడేపూడి వేణుమాధవ్ పరిశీలించారు.ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు, గోసవీడు గ్రామాల్లోని కంటి వెలుగు శిబిరాల్లో రెండో మొత్తం 328 మందికి పరీక్షలు నిర్వహించారు.