
శిశుగృహ ప్రారంభోత్సవంలో మంత్రి అజయ్‌కుమార్
భద్రాచలం, ఆగస్టు 28: సమగ్ర బాలల సంరక్షణే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. భద్రాచలంలో బ్రిడ్జి సెంటర్లో ఏర్పాటుచేసిన శిశుగృహన్ని శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనుకోని కారణాలతో అనాథలుగా మారిన చిన్నారులను ఆదుకోవడానికి ప్రభుత్వం బాధ్యతగా ఈ విధిని స్వీకరించిందన్నారు. వారికి ఆశ్రయ కల్పించి అమ్మ, నాన్న లేని లోటును భర్తీ చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. శిశుగృహలోని పిల్లలు ఆడుకునేందుకు ఆట వస్తువులు, మూడు పూటలా మంచి పౌష్టికాహారం అందజేస్తామన్నారు. కాగా, జోరువానలోనూ మంత్రి ఈ శిశుగృహను ప్రారంభించారు.
సెంట్రల్ లైటింగ్ ప్రారంభం
పట్టణ సుందరీకరణలో భాగంగా రూ.60 లక్షల గ్రామ పంచాయతీ నిధులతో నిర్మించిన సెంట్రల్ మిడియన్ డివైడర్, సెంట్రల్ లైటింగ్‌ను మంత్రి అజయ్ శనివారం రాత్రి ప్రారంభించారు. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జిల్లా జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, కలెక్టర్ అనుదీప్, సీడబ్ల్యూసీ చైర్మన్ భారతి, జిల్లా శిశు, సంక్షేమ శాఖ అధికారి వరలక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగల రాజేందర్, ఐసీడీఎస్ అధికారి హరికుమారి, వివిధ శాఖల జిల్లా అధికారులు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు, మాజీ ఎంపీపీ ఊకే శాంతమ్మ, మాజీ సర్పంచ్ శ్వేత, టీఆర్ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు యశోద నగేశ్, అరికెల్ల తిరుపతిరావు, సీనియర్ నాయకుడు తిప్పన సిద్ధులు పాల్గొన్నారు.