
‘కళామందిర్’ను ప్రారంభించిన మంత్రి అజయ్
ఖమ్మం చాలా బాగుంది : సినీ నటి అనసూయ
దాక్షాయనిని చూడడానికి కిక్కిరిసిన అభిమానులు
ఖమ్మం కల్చరల్, డిసెంబర్ 26 : ఖమ్మం నగరంలోని కస్బాబజార్‌లో ప్రముఖ వస్త్ర వ్యాపారరంగ సంస్థ, పెళ్లి పట్టు చీరెల ప్రత్యేక మందిరం ‘కళామందిర్’ షోరూమ్‌ను ఆదివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ప్రముఖ యాంకర్, సినీ నటి అనసూయ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వస్త్ర రంగంలో పేరున్న కళామందిర్ ప్రారంభంతో ఖమ్మానికి మరో వస్త్ర సోయగం చేరిందన్నారు. హైదరాబాద్, విజయవాడకు దీటుగా ఖమ్మం నగరంలో వస్త్ర షోరూమ్‌లు వినియోగదారులకు అందుబాటులో ఉండడం మంచి పరిణామమన్నారు. పలు రకాల వస్ర్తాలను కొనుగోలు చేసేందుకు ఉమ్మడి జిల్లా వస్త్ర ప్రియులకు మంచి అవకాశం వచ్చిందన్నారు. ప్రముఖ యాంకర్, సినీ నటి అనసూయ మాట్లాడుతూ మంచి నాణ్యత, సరైన ధరలు, వెరైటీలతో లభిస్తున్న వస్ర్తాలు కళామందిర్లో ఉన్నాయన్నారు. అనేక డిజైన్లు, వెరైటీ చీరెలు ఒకచోట లభించడం కళామందిర్ ప్రత్యేకమన్నారు. ఖమ్మం ప్రజల అభిమానం, ఖమ్మం నగరం చాలా బాగుందని ఆనందంతో చెప్పారు. యాంకరింగ్‌తోపాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె షోరూమ్ అంతా కలియ తిరుగుతూ పలు పట్టు వస్ర్తాలను ప్రదర్శించారు. కళామందిర్ కళ్యాణ్ మాట్లాడుతూ కంచి పట్టు, ఉప్పాడ, గద్వాల్, పోచంపల్లి, డిజైనర్ ఫ్యాన్సీ, హ్యాండ్లూమ్ చీరెలు నాణ్యతతో తక్కువ ధరలకు లభిస్తాయన్నారు. రూ.250 నుంచి రూ.2 లక్షల వరకు పలు రకాల చీరెలు అందుబాటులో ఉన్నాయని, జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కళామందిర్ కళ్యాణ్, మోహన్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. రంగస్థలంలో రంగమ్మత్తగా, పుష్పలో దాక్షాయనిగా నటించిన నటి, యాంకర్ అనసూయను చూడడానికి అధిక సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఆమె చిరునవ్వులు చిందిస్తూ ‘హాయ్ ఖమ్మం అంటూ’ అభిమానులకు అభివాదం చేశారు.