
కష్టపడే వారికి ఆయన ఎప్పుడూ అండగా ఉంటారు
వచ్చే ఎన్నికల్లో మధిరలో గులాబీ జెండా ఎగురేయాలి
ఆత్మీయ అభినందన సభలో ఎమ్మెల్సీ తాతా మధు
బోనకల్లు, డిసెంబర్ 26: గులాబీ జెండాకు సీఎం కేసీయారే బాస్ అని ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. పార్టీ బలోపేతం కోసం కష్టపడి పనిచేసే వారికి ఆయన ఎప్పుడూ అండగా ఉంటారని అన్నారు. మధిర వర్తక సంఘం కల్యాణ మండపంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అధ్యక్షతన ఆదివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభలో ఆయన మాట్లాడారు. పార్టీ జెండా మోస్తూ పార్టీకి ద్రోహం చేసే వారు ఎవరున్నా స్వచ్ఛందంగా బయటకు వెళ్లడం మంచిదన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేయాలని, అప్పుడే పార్టీ మరింత బలోపేతమవుతుందని అన్నారు. 2024 ఎన్నికల్లో మధిర నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగురవేసేందుకు ప్రతిఒక్కరూ కంకణబద్ధులై ఉండాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పార్టీ అభ్యున్నతి అహర్నిశలూ కృషిచేస్తానని అన్నారు. పార్టీ పిలుపు మేరకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రజాప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ మధిర అభివృద్ధి కోసం మంత్రి అజయ్, ఎమ్మెల్సీ తాతా మధు పాటుపడాలని కోరారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు మాట్లాడుతూ మధిర నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలను విరివిగా అమలు చేస్తున్నట్లు వివరించారు. రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ నేత బొమ్మెర రామ్మూర్తి, ఏఎంసీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మకమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, మధిర మున్సిపల్ చైర్పర్సన్ మొండితోక లత, ఎంపీపీలు మెండెం లలిత, సామినేని హరిప్రసాద్, చావా వేణు, కోవూరి పూర్ణయ్య, జడ్పీటీసీలు పర్సగాని తిరుపతికిశోర్, పసుపులేటి దుర్గా, శీలం కవిత, నేతలు దిరిశాల శిరీష, మల్లాది వాసు, రావూరి శ్రీనివాసరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, చేబ్రోలు మల్లికార్జునరావు, మోదుగుల నాగేశ్వరరావు, పెంట్యాల పుల్లయ్య, పంబి సాంబశివరావు, లక్ష్మారెడ్డి, అరిగె శ్రీనివాసరావు, మందడపు తిరుమలరావు, మంకెన రమేశ్, బంధం శ్రీనివాసరావు, చావా రామకృష్ణ, శీలం వెంకటరెడ్డి, మొండితోక జయాకర్ తదితరులు పాల్గొన్నారు.