
అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధిపై అధికారులతో సమీక్ష
నగరంలో నివసించే పేదలకు పొజీషన్ పట్టాల పంపిణీ
ఖమ్మం, డిసెంబర్ 26: రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, యువనేత కేటీఆర్ వచ్చే నెల 2న ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌లతో కలిసి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిచనున్నారు. 2న ఉదయం 9 గంటలకు మంత్రులతో కలిసి యువనేత హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరుతారు. 10 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. 10:15 గంటలకు రఘునాథపాలెంలో నూతనంగా నిర్మించే తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేస్తారు. 10:40 గంటలకు ఐటీ హబ్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు నూతనంగా నిర్మించిన ఫుట్‌పాత్‌ను ప్రారంభిస్తారు. 11 గంటలకు లకారం ట్యాంక్‌బండ్‌పై నూతనంగా నిర్మించిన సస్పెన్షన్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో నివసించే పేదలకు పొజిషన్ పట్టాలను పంపిణీ చేస్తారు. 11:20కి 26వ డివిజన్ చర్చికాంపౌండ్‌లో సుందరీకరించిన జంక్షన్‌ను ప్రారంభిస్తారు. 11:40 గంటలకు గోళ్లపాడు కెనాల్‌పై నూతనంగా నిర్మించే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంటేషన్‌కు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12:10 గంటలకు 59వ డివిజన్ దానవాయిగూడెంలో స్పెషల్ స్లెడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. 12:30 గంటలకు ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధిపై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారు. భోజన విరామం అనంతరం 2:30 గంటలకు ఖమ్మం నుంచి బయలుదేరి 3:45 గంటలకు కల్లూరు మండలం పోచవరం గ్రామానికి చేరుకుంటారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య విగ్రహాన్ని ప్రారంభిస్తారు. 4:30 గంటలకు పోచవరంలో హెలీప్యాడ్ ద్వారా తిరిగి హైదరాబాద్‌కు పయనమవుతారు.