
మౌలిక వసతుల కల్పనలో రాజీపడొద్దు
పురాతన భవనాలను తొలగించి నూతన నిర్మాణాలు చేపట్టాలి
అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయండి
రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
అగ్నిమాపక సేవలపై ఫైర్ డీజీకి ఫోన్‌కాల్
ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 26: వ్యవసాయ మార్కెట్‌కు పంట ఉత్పత్తులు తీసుకొచ్చే ఏ ఒక్క రైతుకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదేశించారు. గురువారం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, నగర కార్పొరేషన్ మేయర్ నీరజతో కలిసి మంత్రి వ్యవసాయ మార్కెట్‌ను ఆకస్మికంగా సందర్శించి సమీక్ష నిర్వహించారు. మార్కెట్‌కు సంబంధించిన చిత్రం(నక్షా) ఆధారంగా యార్డుల పరిస్థితి, రాబోయే సీజన్‌కు సన్నద్ధం అవుతున్న తీరుపై ఆరా తీశారు. అనంతరం పాలకవర్గం బాధ్యులు, అధికారులకు ఆయా పనుల పురోగతిపై దిశానిర్దేశం చేశారు.
వ్యవసాయ మార్కెట్‌కు పంట ఉత్పత్తులు తీసుకువచ్చే ఏ ఒక్క రైతుకూ అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల చర్యలూ తీసుకోవాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆదేశించారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కేఎంసీ మేయర్ నీరజతో కలిసి వ్యవసాయ మార్కెట్‌ను గురువారం మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, వైస్ చైర్మన్ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులతో కలిసి మార్కెట్‌పై సమీక్షించారు. మార్కెట్ నక్షా ఆధారంగా యార్డుల పరిస్థితి, రాబోయే సీజన్‌కు సన్నద్ధం అవుతున్న తీరుపై ఆరా తీశారు. మార్కెట్ యార్డు లోపల సరిపడా మరుగుదొడ్లు, యార్డుల వెలుపల ప్రత్యేకంగా సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టాలన్నారు. మిర్చియార్డులో ఉన్న పురాతన భూసార పరీక్షా కేంద్రం, పాత కార్యాలయం, రైతు విశ్రాంతి భవనాల తొలగింపునకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మార్కెటింగ్‌శాఖ డీఈ, ఏఈలను ఆదేశించారు. దాదాపు రూ.కోటితో ఏర్పాటుచేసిన అగ్నిమాపక కేంద్రం, వాహనం సేవల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. వాహనాన్ని తిరిగి అగ్నిమాపక శాఖ తీసుకెళ్లినట్లు అధికారులు చెప్పడంతో వెంటనే రాష్ట్ర ఫైర్ డీజీ సంజయ్‌కి మంత్రి ఫోన్ చేసి మాట్లాడారు. ఖమ్మం మార్కెట్లోకి తక్షణమే అగ్నిమాపక సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అనంతరం ఏఎంసీ పాలకవర్గంతో మాట్లాడుతూ.. సిరిసిల్ల మార్కెట్ తరహాలో ఖమ్మం మార్కెట్లోనూ అన్ని హంగులూ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, డిప్యూటీ మేయర్ ఫాతిమా, ఏఎంసీ మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, పాలకవర్గ సభ్యులు పత్తిపాక రమేశ్, దేవత్ అనిల్, కార్మిక సంఘం నాయకుడు నున్నా మాధవరావు, మిర్చిశాఖ బాధ్యులు మాటేటి నాగేశ్వరరావు, మల్లిశెట్టి వెంకటేశ్వర్లు, గ్రేడ్ టూ అధికారి బజార్ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ
పేదలకు లబ్ధిచేకూర్చే పథకాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరాయంగా నిధులు మంజూరు చేస్తున్నారని మంత్రి అజయ్‌కుమార్ పేర్కొన్నారు. అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొంది ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి అజయ్ పంపిణీ చేశారు. 32 మందికి రూ.12.99 లక్షలు మంజూరైనట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఇప్పటి వరకూ నియోజకవర్గంలో 1,813 మందికి రూ.7.73 కోట్లు పంపిణీ చేసినట్లు వివరించారు.
వీధి వ్యాపారుల ప్రాంగణం ప్రారంభం
నగరంలోని 9వ డివిజన్ రోటరీనగరంలో రూ.37 లక్షలతో నిర్మించిన వీధి వ్యాపారుల దుకాణ సముదాయాన్ని మేయర్ నీరజతో కలిసి మంత్రి అజయ్ ప్రారంభించారు. అనంతరం నయాబజార్ సర్కిల్ వద్ద రూ.38.60 లక్షలతో నిర్మించనున్న వీధి వ్యాపారుల ప్రాంగణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, కమిషనర్ అనురాగ్‌జయంతి, ఎస్ఈ ఆంజనేయప్రసాద్, కార్పొరేటర్లు జాన్‌బీ, రామ్మోహన్రావు, వైష్ణవి, కమర్తపు మురళి పాల్గొన్నారు.