
ప్రత్యేక ఆకర్షణగా క్రిస్మస్ ట్రీలు ఆకట్టుకున్న
శాంటాక్లాజ్‌ల వేషధారణ
ఖమ్మం కల్చరల్, కొత్తగూడెం కల్చరల్, డిసెంబర్ 25 ;లోక రక్షకుడు.. కరుణామయుడి జన్మదిన వేడుక క్రిస్మస్ సంబురాలు అంబరాన్నంటాయి. శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ప్రార్థనా మందిరాలు క్రైస్తవ విశ్వాసులతో కిటకిటలాడాయి. ఏసు నామస్మరణతో చర్చీలు మార్మోగాయి. కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. శాంటా క్లాజ్ వేషధారులు చిన్నారులకు బహుమతులు అందించి సందడి చేశారు. క్రైస్తవుల ఇళ్ల ముంగిట క్రిస్మస్ చెట్లు, పశువుల పాకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రార్థనా మందిరాల్లో బిషప్‌లు, సంఘ కాపరులు దైవసందేశమిచ్చారు.. భక్తి గీతాలు ఆలపిస్తూ విశ్వాసకులు క్రిస్మస్ను ఘనంగా జరుపుకొన్నారు. ఖమ్మం నగరంలోని చర్చి కాంపౌండ్ సీఎస్ఐలో జరిగిన వేడుకలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పాల్గొన్నారు.
కైస్తవ ప్రార్థనా మందిరాల్లో ప్రభువు నామస్మరణ.. సర్వాంగ సుందరంగా ముస్తాబైన చర్చిల్లో విశ్వాసుల కిటకిట.. అలరించే క్రిస్మస్ ట్రీలు, ప్రత్యేక అలంకరణతో ఉన్న క్రిబ్‌లో మహిమాన్వితమైన బాల ఏసు.. తూర్పు దేశ జ్ఞానులు.. ప్రత్యేక ప్రార్థనలు.. వెరసి ప్రభువు జననం మహిమాన్వితమైంది. క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ సందర్భంగా ఉమ్మడి జిల్లా అంతటా భక్తిభావం నిండిపోయింది. శనివారం తెల్లవారుజాము నుంచి జిల్లాలోని పలు చర్చిల్లో ఏసు జనన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రార్థనలు, బైబిల్ సందేశాలు, పాస్టర్ల క్రీస్తు బోధనలతో ఆధ్యాత్మికత, భక్తిభావం ఓలలాడాయి. ఖమ్మం చర్చికాంపౌండ్‌లోని సీఎస్ఐ చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్ పాల్గొని కీస్తు సందేశాన్ని బోధించారు. లోకరక్షణ కోసం క్రీస్తు జన్మించారని, ఆయన జననం లోకహితమని ఉపదేశించారు. – నమస్తే నెట్వర్క్
చర్చిలన్నీ కిటకిటలాడాయి. కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లోని సెయింట్ ఆండ్రూస్ చర్చి, ప్రభుత్వ జూనియర్ కాలేజీ పక్కనున్న సెయింట్ పీటర్స్ చర్చి, రుద్రంపూర్‌లోని పెంతెకోస్తు చర్చి, రామవరం, ధన్‌బాద్, గౌతంపూర్, చుంచుపల్లి, సుజాతనగర్, లక్ష్మీదేవిపల్లి, పాల్వంచలోని ఆరోగ్య మాత దేవాలయాలు.. ఇలా అన్ని చర్చిలకు శనివారం అర్ధరాత్రి నుంచే భక్తుల రాక మొదలైంది. శాంతి సందేశాలను వింటూ ఏసయ్యను స్మరించారు.. కీర్తించారు. ‘దయుంచయ్యా.. దీవించయ్యా..’ అని వేడుకున్నారు. సెయింట్ ఆండ్రూస్ చర్చి, సెయింట్ పీటర్స్ చర్చిల్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో టీఆర్ఎస్ నాయకుడు వనమా రాఘవేందర్రావు, మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు మత పెద్దల ఆశీర్వాదం అందుకున్నారు. వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, కొత్తగూడెం మున్సిపల్ వైస్ చైర్మన్ వేల్పుల దామోదర్ యాదవ్, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్, నాయకులు ఊకంటి గోపాల్‌రావు, కాసుల వెంకట్, ఆళ్ల మురళి, నాగేందర్ త్రివేది, మసూద్, కౌన్సిలర్లు కోలాపురి ధర్మరా జు, రుక్మాంగధర్ బండారి, పరమేష్ యాదవ్, పల్లె పు లక్ష్మణ్, ఉర్దూఘర్ కమిటీ చైర్మన్ అన్వర్‌పాషా, టీబీజీకేఎస్ నాయకులు ఎండీ రజాక్, కాపు కృష్ణ, జే బీ మోహన్, కేకే శ్రీను, సుందర్రాజు, వాసు, మాదా శ్రీరాములు, పూర్ణ, బొమ్మిడి శ్రీకాంత్, ఓంప్రకాష్, కన్ని, బాచి, అశోక్, సాయి, బాలప్రసాద్ పాసి, చిరంజీవి, వినయ్, ఈశ్వర్, చింతా నాగరాజు, చిన్నపండు, సంతోష్‌రెడ్డి, రాజుగౌడ్ పాల్గొన్నారు.
లక్ష్మీదేవిపల్లి: మండలంలోని చాతకొండలో జరిగిన వేడుకలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, వివిధ సంఘాలు/కమిటీల బాధ్యులు జక్కుల సుందర్రావు, బత్తుల వీరయ్య, ఎండీ యాకూబ్, ఎండీ యాకూబ్ పాషా, కొండ, శేషాద్రి వినోద్, రాజు, శ్రీను, గడ్డం తిరుపతి పాల్గొన్నారు.
సుజాతనగర్: మండలంలోని కల్వరి సియోన్ ప్రార్థ్ధనా మందిరంలో పాస్టర్ పాల్ తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం టౌన్: టీవీపీఎస్ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో డీపీఆర్వో శీలం శ్రీనివాస్ కేక్ కట్ చేశారు. టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కల్లోజి శ్రీనివాస్, టీవీపీఎస్ నాయకులు మాలోత్ జగ్గుదాస్, నాగేశ్వరరావు, మేడి ప్రవీణ్, సున్నం కరుణాకర్ పాల్గొన్నారు.
కొత్తగూడెం అర్బన్: కొత్తగూడెంలో జరిగిన ప్రత్యేక ప్రా ర్థనల్లో మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా పాల్గొన్నారు.
పాల్వంచ రూరల్: పాల్వంచలోని ఆర్సీఎం చర్చిలో టీఆర్ఎస్ నాయకుడు వనమా రాఘవేందర్రావు తదితరులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
కొత్తగూడెం అర్బన్: కొత్తగూడెం మున్సిపల్ 20వ వార్డులోని యెహోవా షాలోమ్ మందిరంలో మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. పాస్టర్ మహిమ జ్యోతి, మహిమ రాజు, కౌన్సిలర్ అజ్మీరా సుజాత పాల్గొన్నారు.
చుంచుపల్లి: రుద్రంపూర్‌లోని సీఎస్ఐ చర్చిలో జరిగిన వేడుకల్లో సర్పంచ్ గుమ్మడి సాగర్, టీఆర్ఎస్ నాయకుడు రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.