
చిల్డ్రన్స్ పార్కు, వాకింగ్ ట్రాక్, లోటస్‌పాండ్ ఏర్పాటుచేయాలి
పార్కు స్థలం పరిశీలనలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
రఘునాథపాలెం, ఆగస్టు 25: రఘునాథపాలెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసే ‘మెగా పార్క్’ను మోడల్‌గా తీర్చిదిద్దాలని మంత్రి అజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. రఘునాథపాలెం రెవెన్యూ సర్వే నెంబర్ 22లో బృహత్ పల్లెప్రకృతి వనం ఏర్పాటు కోసం కేటాయించిన స్థలాన్ని ఖమ్మం కలెక్టర్ గౌతమ్‌తో కలిసి బుధవారం పరిశీలించారు. పార్కుకు ఆనుకొని అయ్యవారికుంట ఉండడంతో చెరువును సైతం ట్యాంక్‌బండ్ మాదిరిగా అభివృద్ధి చేయాలన్నారు. 20 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిత్యం మండల ప్రజలు వాకింగ్ చేసుకునేందుకు ట్రాక్, పిల్లలు ఆడుకునేందుకు ఆటువస్తువులతో కూడిన చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేయాలని, చెరువును లోటస్పాండ్గా తీర్చిదిద్దాలని సూచించారు. జడ్పీటీసీ మాళోతు ప్రియాంక, వైస్ ఎంపీపీ గుత్తా రవికుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుర్రా భాస్కర్‌రావు, సర్పంచ్ గుడిపూడి శారద, ఉప సర్పంచ్ కుందేసాహెబ్, నాయకులు గుడిపుడి రామారావు, సుడా డైరెక్టర్ దేవభక్తుని కిశోర్‌బాబు, వాంకుడోతు సురేశ్, కాంపాటి రవి, ఎంపీడీవో రామకృష్ణ, గ్రామ కార్యదర్శి ప్రసన్నకుమార్, ఫారెస్టు అధికారులు పాల్గొన్నారు.
కేజీబీవీని పరిశీలించిన మంత్రి
రఘునాథపాలెంలో నూతనంగా నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలను మంత్రి అజయ్‌కుమార్ బుధవారం పరిశీలించారు. సెప్టెంబర్ 1 నుంచి నూతన భవనం నుంచే తరగతులను ప్రారంభం కావాలన్నారు. అందుకు అవసరమైన అన్ని వసతులనూ సమకూర్చాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల చుట్టూ ప్రహారీ నిర్మాణం విషయమై కలెక్టర్‌తో చర్చించారు. ప్రహరీ నిర్మాణం చేపడితే భవనం ఎదురుగా ఉన్న ప్రాంగణం ఆటస్థలంగా ఉపయోగపడుతుందన్నారు. అందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.