
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
నియోజకవర్గంలో 89 మందికి రూ.38.47లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
సత్తుపల్లి, ఆగస్టు 22 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు రెండు కళ్లని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో 89 మంది లబ్ధిదారులకు రూ.38.47లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఏ సంక్షేమ పథకాలు అమలు చేసినా అవి నిరంతరం కొనసాగుతూనే ఉంటాయన్నారు. కులమతాలకు అతీతంగా సీఎంఆర్ఎఫ్ను అందించి నిరుపేద కుటుంబాల్లో వెలుగులు నింపుతూ భరోసా కల్పిస్తున్నారన్నారు. పల్లెలు, పట్టణాల అభివృద్ధిలో ఎంతో ముందున్నాయని, పట్టణాన్ని రూ.70కోట్లతో అభివృద్ధి చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గతంలో దరఖాస్తు చేసుకున్న నిరుపేదలకు కొత్త రేషన్‌కార్డులు, దళితుల అభ్యున్నతికి దళితబంధు పథకం వంటి వాటిని ప్రజలకు చేరువచేస్తూ అభివృద్ధిలో తెలంగాణ ముందుండేలా శ్రమిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఏ పథకమైనా నేరుగా లబ్ధిదారుల చెంతకే చేరేలా చేపడుతున్న ఘనత ఆయనదేనన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు, కనగాల వెంకట్రావు, అశోక్, పటేల్, దామోదర్‌రెడ్డి, కాలినేని వెంకటేశ్వరరావు, చాంద్‌పాషా, పవన్ పాల్గొన్నారు.
ఆపదలో ఉన్నవారికి అండ..
పెనుబల్లి, ఆగస్టు 22 : సీఎం సహాయనిధి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని, ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండలంలో 14 మందికి రూ.9,38,000ల చెక్కులు మంజూరు కాగా ఆయన తాళ్ళపెంటలో లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదలకు భరోసా ఇచ్చేది ముఖ్యమంత్రి సహాయనిధి అని, అర్హులైన వారు వినియోగించుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఆయన వెంట మండల అధ్యక్షుడు కనగాల వెంకటరావు, ఏఎంసీ చైర్మన్ చెక్కిలాల లక్ష్మణ్‌రావు, నీలాద్రి చైర్మన్ పసుమర్తి వెంకటేశ్వరరావు, నాయకులు లక్కినేని వినీల్, కాకా సీతారాములు, బండి రాఘవులు, రాయపూడి మల్లయ్య, ఆళ్ల రాంబాబు ఉన్నారు.