
అభివృద్ధిలో తెలంగాణ నంబర్ వన్
ఎంపీ నామా నాగేశ్వరరావు
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
ఖమ్మం ఆగస్టు 21: సీఎం కేసీఆర్ పాలన యావత్తు దేశానికి ఆదర్శమని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఆయన క్యాంపు కార్యాలయంలో ఎర్రుపాలెం, బోనకల్, చింతకాని, మధిర, ముదిగొండ మండలాలకు చెందిన 150 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులపై సీఎం కేసీఆర్ స్వహస్తాలతో సంతకం చేస్తారన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, టీఆర్ఎస్ నాయకురాలు బేబీ స్వర్ణకుమారి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, హరిప్రసాద్, శిరీష, పూర్ణయ్య, తిరుపతి కిశోర్, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, రామకృష్ణ పాల్గొన్నారు.
సోలార్ ప్లాంట్ ప్రారంభం..
సమాజానికి సేవా గుణం కలిగిన వ్యక్తులు అవసరమని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఎన్నెస్పీ క్వార్టర్స్‌లోని జీవన సంధ్య వృద్ధ్దాశ్రమంలో ఎన్ఆర్ఐలు శ్రీకాంత్, లత రూ.5 లక్షలతో సమకూర్చిన సోలార్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభించి మాట్లాడారు. అనంతరం ఆశ్రమంలోని వృద్ధులను సన్మానించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ నాయకురాలు స్వర్ణకుమారి, నాయకులు పగడాల నాగరాజు, చిత్తారు సింహాద్రి యాదవ్, తన్నీరు రవి, శ్రీధర్, చావా రమేష్, రాజేశ్, హరీశ్, ప్రసాద్ పాల్గొన్నారు.