బుధవారం 15 జూలై 2020
Khammam - Apr 13, 2020 , 02:27:27

కంటైన్మెంట్‌ పరిధిలో నో ఎంట్రీ.. నో ఎగ్జిట్‌

కంటైన్మెంట్‌ పరిధిలో నో ఎంట్రీ.. నో ఎగ్జిట్‌

  • ఈ నిబంధనను కఠినంగా అమలుచేయాలి 
  • జిల్లా అధికారులకు మంత్రి అజయ్‌ ఆదేశం
  • ఆ ప్రాంతాల్లో సరుకులు పంపిణీ చేసిన మంత్రి

ఖమ్మం, నమస్తే తెలంగాణ: నగరంలో కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో ‘నో ఎంట్రీ, నో ఎగ్జిట్‌' నిబంధనను కఠినంగా అమలు చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. కాల్వొడ్డు సమీపంలోని మోతీనగర్‌లో ఆదివారం సాయంత్రం కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌తో కలిసి మంత్రి పర్యటించారు. పరిస్థితులను పరిశీలించి అధికారులకు పలు ఆదేశాలు చేశారు. కంటైన్మెంట్‌ జోన్‌లోని నివాసితులకు నిత్యావసర వస్తువులు, పాలు, కూరగాయలను మంత్రి స్వయంగా పంపిణీ చేశారు. కంటైన్మెంట్‌ పరిధిలో ఎవరూ కూడా బయటి నుంచి లోనికి వెళ్లకూడదని, లోపలి నుంచి బయటికు రాకూడదని స్పష్టం చేశారు. నివాసితులకు నిత్యావసర వస్తువులు, మంచినీళ్లు క్రమం తప్పకుండా అందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. దీనితోపాటు సమగ్ర సర్వే ద్వారా ప్రజల ఆరోగ్య సమాచారం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారి సమాచారం సేకరించాలని సూచించారు. అదేవిధంగా రసాయన ద్రావణాలను ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం తప్పనిసరిగా స్ప్రే చేయాలన్నారు. ప్రజలెవ్వరూ ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు. పరిస్థితులను అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ స్వీయ నిర్బంధం పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నగరపాలక సంస్థ కమిషనర్‌ అనురాగ్‌ జయంతి, డివిజన్‌ ఇన్‌చార్జి, జిల్లా పర్యాటక శాఖాధికారి సుమన్‌ చక్రమర్తి, అర్బన్‌ తహసీల్దారు శ్రీనివాసరావు, వైద్యాధికారులు, సర్వే సిబ్బంది, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

తాజావార్తలు


logo