శనివారం 04 ఏప్రిల్ 2020
Khammam - Jan 25, 2020 , 00:30:26

బాలికా.. భళా..!

బాలికా.. భళా..!
  • -సంబురంగా యువ కళోత్సవం..
  • -అబ్బురపర్చిన విద్యార్థినుల ప్రదర్శనలు..
  • -హాజరైన జడ్పీ చైర్మన్‌ కమల్‌రాజ్‌

 ఖమ్మం కల్చరల్‌ జనవరి24 : ప్లాస్టిక్‌ రహిత పర్యావరణం.. వ్యసనానికి గురి చేస్తున్న మొబైల్స్‌ వాడకం.. ప్రపంచీకరణలో నలుగుతున్న సగటు జీవి.. ఆడపిల్లను రక్షించాలి. పలు రంగాల్లో రాణిస్తున్న మహిళా కెరటాలు... ఒకటేమిటి పలు చైతన్య అంశాలతో బాలికలు తమ సృజన, సత్తాను చాటి శభాష్‌ అనిపించుకున్నారు.  అన్ని రంగాల్లో మేము మేటి అంటూ బాలికలు పలు అంశాల్లో  తమ ప్రతిభకు పదునుపెట్టారు. మువ్వా పద్మావతి రంగయ్య ఫౌండేషన్‌, ప్రముఖ  డ్యాన్స్‌ మాస్టర్‌, ఉత్సవ కన్వీనర్‌ రవికుల నారాయణ  ప్రసాద్‌ ఆధ్వర్యంలో నగరంలోని లేక్‌వ్యూక్లబ్‌లో శుక్రవారం ‘ యువ కళోత్సవం 2020’ అట్టహాసంగా ప్రారంభమైంది. తెలుగు బాలికా పండుగగా ప్రతిభా పోటీలు, సాంస్కృతిక పోటీలతో లేక్‌వ్యూక్లబ్‌ పరవశించింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల విద్యార్థినులు పలు అంశాలలో నిర్వహించిన పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిత్రలేఖనం, వ్యాసరచన, వక్తృత్వం పోటీల్లో సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో వందలాది మంది బాలికలు పాల్గొన్నారు. తొలుత జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజ్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు. అన్ని రంగాల్లో ముందుకెళుతున్న మహిళా శక్తికి నిదర్శనంగా ఈ ఉత్సవం ఉందన్నారు. బాలికల్లో దాగి ఉన్న సృజన, ప్రతిభను వెలికితీయడానికి ఈ పోటీలు ఉపయుక్తమవుతాయన్నారు. పలు అంశాలను ప్రతిబింబిస్తూ బాలికలు ప్రదర్శించిన నృత్యాలు అబ్బురపర్చాయి. రక రకాల వేషధారణలతో చైతన్యపర్చే కళా రూపాలతో బాలికలు మెరిశారు. కార్యక్రమంలో మహిళా ప్రాంగణం అధికారి వేల్పుల విజేత, ఉత్సవ కన్వీనర్‌ రవికుల నారాయణ  ప్రసాద్‌, కో-ఆర్డినేటర్‌ శివకుమార్‌,  డాక్టర్‌ చింతనిప్పు ప్రశాంతి, చల్లా శేషగిరిరావు, వీరారెడ్డి, రామచందర్‌రావు, ప్రభాకర్‌రెడ్డి, అధిక సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు.logo