
జూలూరుపాడు, నవంబర్ 19: మండలంలోని కాకర్ల గ్రామానికి ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభమైంది. మొదటిగా ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి చొప్పున తిరిగేలా శుక్రవారం నుంచి సర్వీసును ప్రారంభించారు. ఆర్టీసీ బస్సు 12 ఏళ్ల తర్వాత గ్రామానికి రావడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. సహకార సంఘం ఉపాధ్యక్షుడు చీమలపాటి భిక్షం రిబ్బన్ కట్‌చేసి బస్సు సర్వీసును ప్రారంభించారు. తమ గ్రామానికి ఆర్టీసీ బస్సును నడిపించాలని కోరుతూ కాకర్ల గ్రామ యువకుడు చెవుల బాలరాజు ఇటీవల ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను ట్విట్టర్లో కోరిన విషయం విదితమే. దీనికి స్పందించిన ఆయన.. ఆర్టీసీ అధికారులను ఆదేశించడంతో వారు రూట్ మాప్ పరిశీలించారు. శుక్రవారం గ్రామానికి బస్సు సర్వీసును ప్రారంభించారు. గ్రామస్తుందరూ అందులోనే ప్రయాణం చేయాలని గ్రామంలో చాటింపు వేశారు.