
ఖమ్మం, డిసెంబర్ 17: ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికైన తాతా మధుసూదన్.. ముఖ్యమంత్రి కేసీఆర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శుక్రవారం జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో సీఎంకు పుష్పగుచ్ఛం అందజేసి తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎంపీ నామాకు తాతా మధు సన్మానం
ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావును ఎమ్మెల్సీ తాతా మధు సన్మానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయానికి సహకరించినందుకు కృతజ్ఞతగా శుక్రవారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఎంపీ నామా నివాసంలో ఆయనను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా తాతామధును కూడా ఎంపీ నామా ప్రత్యేకంగా అభినందించారు. చుంచు విజయ్, ఆశ్విన్కుమార్ ల్గొన్నారు.