
లాభాల బాటలో ఆర్టీసీ కార్గో
ఖమ్మంలో హోం డెలివరీకి అవకాశం
అతి తక్కువ చార్జీలకే ఇంటికి సరుకు రవాణా
త్వరలో రీజియన్ పరిధిలోని అన్ని పట్టణాల్లో అమలు
ఖమ్మం, ఆగస్టు 16;ఆర్టీసీ ప్రయాణం సురక్షితం.. సుఖమయం అనే నినాదంతో ముందుకు సాగుతున్నది. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేస్తే ఇంటికి చేరుకునే వరకూ నమ్మకం లేదు. దీంతో ఆర్టీసీ ప్రజాదరణ పొందింది. అయితే, ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ కార్గో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గతేడాది జూన్ 19వ తేదీన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్ కార్గో సేవలు ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఖమ్మం రీజియన్ పరిధిలో ఈ సేవల ద్వారా సంస్థకు రూ.1.50 కోట్ల ఆదాయం సమకూరింది. మరింత ఆదాయం కోసం ఆర్టీసీ హోం డెలివరీ సేవలనూ అందించేందుకు ముందుకొచ్చింది. ఒక బస్టాండ్ నుంచి మరొక బస్టాండ్ వరకు అందిన సేవలు ఇప్పుడు ఇంటి ముంగిటకు చేరువ కానున్నాయి.
ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడంలో ఆర్టీసీకి మంచి పేరు ఉన్నది. తక్కువ ఛార్జీలకే గమ్యస్థానాలకు చేరుస్తూ టీఎస్ ఆర్టీసీ ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్నది. ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్గో సేవలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నది. గతేడాది జూన్ 19 న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్‌కుమార్ ఖమ్మంలో కార్గో సేవలను ప్రారంభించారు. ఈ సేవలను ప్రజలు, వ్యాపారులు ఆదరిస్తున్నారు. సేవలు ప్రారంభమైన నాటి నుంచి ఖమ్మం రీజియన్ పరిధిలో కార్గో సేవల ద్వారా ఇప్పటివరకు రూ.1.50 కోట్ల ఆదాయం వచ్చింది. మరింత ఆదాయం సాధించేందుకు యాజమాన్యం తాజాగా హోం డెలివరీ సేవలనూ ప్రారంభించింది. ఇప్పటివరకు ఒక బస్టాండ్ నుంచి మరొక బస్టాండ్ వరకు అందిన సేవలు ఇప్పుడు ఇంటి వద్దకూ అందనున్నాయి.
కార్గోలో మూడు రకాల సేవలు…
ఆర్టీసీ కార్గో ద్వారా కార్గో, పార్శిల్, కొరియర్ సేవలు అందుతున్నాయి. కార్గో ద్వారా వెయ్యి కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్న వస్తువులు, పార్సిల్ సర్వీసు ద్వారా 50 కిలోల కంటే లోపు బరువు ఉన్న వస్తువులు, కొరియర్ ద్వారా డాక్యుమెంట్లు, పేపర్లు రవాణా జరుగుతున్నది. ఈ సేవలపై ఆర్టీసీ యాజమాన్యం ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నది. బ్యానర్లు, కరపత్రాలు పంచుతున్నది. ఖమ్మం రీజియన్ పరిధిలోని బస్టాండుల్లో సిబ్బంది మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నారు.
ఆధునిక సాంకేతికత వినియోగం..
సరుకు రవాణాకు ఆర్టీసీ యాజమాన్యం ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నది. సరుకు డెలివరీపై ట్రాకింగ్ విధానాన్ని అమలు చేస్తున్నది. పార్సిల్‌కు వచ్చిన ప్రతి వస్తువును ఫొటో తీసి కంప్యూటర్లో పొందు పరిచేలా విధి విధానాలు ఉన్నాయి. గమ్యస్థానాలకు చేరిన తర్వాత కార్యాలయంలో సులభంగా సరుకు ఉన్న చోటును గుర్తించేలా ఏర్పాట్లు ఉన్నాయి. వినియోగదారుడు సరుకు తీసుకోవడానికి వచ్చినప్పుడు నిమిషాల్లో డెలివరీ చేసేలా ఏర్పాట్లు ఉన్నాయి.
త్వరలో అన్ని పట్టణాల్లో అమలు..
ఖమ్మం రీజియన్‌లో పది రోజుల నుంచి ఆర్టీసీ కార్గో హోం సేవలు అందుతున్నాయి. అధికారులు తొలుత ఖమ్మం నగరంలో సేవలు ప్రారంభించారు. హోం డెలివరీ అవసరమైన వారు 81253 18328, 97055 95396, 915429 8582, 91542 98583 నెంబర్లలో సంప్రదించవచ్చు. త్వరలో కొత్తగూడెం, పాల్వంచ, సత్తుపల్లి, భద్రాచలం, మణుగూరు, మధిర పట్టణాల్లో హోం డెలివరీ సర్వీసులు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు.
సేవలను వినియోగించుకోవాలి
ఆర్టీసీలో కార్గో సేవలు సక్సెస్ అయ్యాయి. ప్రజలు, వాణిజ్య వ్యాపారులు కార్గోను ఆదరించారు. నామ మాత్రపు ఛార్జీలతో ఇప్పుడు హోం డెలివరీ సేవలనూ అందుబాటులోకి తీసుకువస్తున్నాం. బయట ప్రైవేటు సంస్థలు, ఏజెన్సీల కంటే తక్కువ ధరకే సేవలు అందిస్తాం. ప్రజలు కార్గో హోం డెలివరీ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
-పి.సాలోమాన్, ఆర్టీసీ ఆర్ఎం, ఖమ్మం