
హుజూరాబాద్‌కు 150 కార్ల ర్యాలీ ప్రారంభంలో పాలేరు ఎమ్మెల్యే
ఖమ్మం నుంచి 60 కార్డు, రెండు బస్సుల్లో టీఆర్ఎస్ శ్రేణులు
ఖమ్మం/ కూసుమంచి, ఆగస్టు 16: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ సోమవారం ప్రారంభించిన దళితబంధు కార్యక్రమానికి ఖమ్మం నియోజకవర్గం నుంచి రెండు బస్సులు, 60 కార్లలో ప్రజాప్రతినిధులు, నాయకులు తరలివెళ్లారు. మంత్రి అజయ్‌కుమార్ హైదరాబాద్ నుంచి మంత్రి కేటీఆర్‌తో కలిసి ఒకే వాహనంలో వెళ్లారు. హుజూరాబాద్ తరలివెళ్లిన వారిలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మేయర్ నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ లక్ష్మీప్రసన్న, టీఆర్ఎస్ నేతలు ఆర్జేసీ కృష్ణ, కమర్తపు మురళి, ఆళ్ల అంజిరెడ్డి, చింతనిప్పు కృష్ణ చైతన్య, మాటేటి కిరణ్‌కుమార్, లింగాల రవికుమార్, ఎండీ తాజుద్దీన్, హెచ్ ప్రసాద్, దేవభక్తుని కిశోర్‌బాబు, మాటేటి నాగేశ్వరరావు, లింగనబోయిన లక్ష్మణ్, బుర్రి వెంకట్, కుర్రా భాస్కర్‌రావు ఉన్నారు. పాలేరు నుంచి వెళ్తున్న 150 కార్ల ర్యాలీని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి జెండాఊపి ప్రారంభించారు.