
సోషల్ మీడియాను వినియోగించండి
ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టండి
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు
మణుగూరులో టీఆర్ఎస్ యువజన విభాగ సమావేశం
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు
మణుగూరు రూరల్, ఆగస్టు 14: టీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ పథకాలను, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. శనివారం పట్టణంలోని పద్మశాలి భవన్లో పార్టీ యువజన విభాగ పట్టణ అధ్యక్షుడు రుద్రవెంకట్ అధ్యక్షతన నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాల చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టాలన్నారు. కరోనా కాలంలో కార్యకర్తలు ప్రజలకు మధ్య వారధిలా ఉండాలన్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీ పేరు ప్రతిష్ఠలను మరింత పెంచాలన్నారు. చిన్న విషయాలకు నిరుత్సాహానికి గురికావొద్దన్నారు. సమావేశంలో డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, జడ్పీటీసీ పోశం నర్సింహారావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు అడపా అప్పారావు, నాయకులు మట్టపల్లి సాగర్ యాదవ్, కోటి పాల్గొన్నారు.