
సహకార సంఘాలతో కర్షకుల బలోపేతం
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్
కామేపల్లి, టేకులపల్లిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కామేపల్లి, ఆగస్టు 13: అన్నదాతల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని, తెలంగాణలో రైతే రాజుగా నిలిచారని, ‘నేను రైతును’ అని గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం, భద్రాద్రి జిల్లా టేకులపల్లిలో పలు అభివృద్ధి పనులకు ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణంతో కలిసి శుక్రవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో రైతుల దీవెనలే సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి శ్రీరామరక్ష అన్నారు.
అన్నదాతల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని, తెలంగాణలో రైతే రాజుగా నిలిచారని, ‘నేను రైతును’ అని గర్వంగా చెప్పుకునే రోజులు వచ్చాయని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని పండితాపురంలో నాబార్డు స్పెషల్ రీ-ఫెనాన్స్ నిధులు రూ.31.58 లక్షలతో నూతనంగా నిర్మించనున్న కొండాయిగూడెం సహకార సంఘం కార్యాలయ భవనం, గిడ్డంగి పనులకు ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణంతో కలిసి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వ్యవసాయానికే వెన్నుదన్నుగా నిలిచేది సహకార రంగమేనని, సహకార సంఘాలతో రైతులు ఆర్థికంగా బలోపేతం అవుతున్నారని అన్నారు. తెలంగాణలో రైతుల దీవెనలే సీఎం కేసీఆర్‌కు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి శ్రీరామరక్ష అన్నారు.
ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఇల్లెందు మున్సిపాలిటీ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, ఎంపీపీ బానోత్ సునీత, సొసైటీ చైర్మన్ ధనియాకుల హనుమంతరావు, తీర్థాల చిదంబరరావు, డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబుయాదవ్, సర్పంచ్ మూడ్ దుర్గాజ్యోతి, డీసీవో విజయకుమారి, డీసీసీబీ ఏజీఎం చందర్రావు, మేనేజర్ వెంకటేశ్వర్లు, ఏడీఏ శ్రీనివాసరావు, తహసీల్దార్ దారా ప్రసాద్, ఎంపీడీవో సిలార్‌సాహెబ్, ఏవో తారాదేవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంతోటి అచ్చయ్య, సొసైటీ డైరెక్టర్లు దండగల దేవేందర్, మేకపోతుల మహేశ్, దొడ్డ మల్లేశ్, అంబడిపూడి వెంకటేశ్వర్లు, సీఈవో దొడ్డ ముత్తయ్య, రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు బానోత్ నర్సింహానాయక్ , సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.