
ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలు
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్‌కుమార్
టేకులపల్లిలో డివైడర్ నిర్మాణానికి శంకుస్థాపన
బేతంపూడి స్టేజీ వద్ద బీటీ రోడ్డు ప్రారంభం
టేకులపల్లి, ఆగస్టు 13: సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందని అన్నారు. టేకులపల్లి మండల కేంద్రంలో ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ అధ్యక్షతన శుక్రవారం పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలకు ఆయన హాజరయ్యారు. తొలుత మండలం కేంద్రంలో డివైడర్, సెంట్రల్ లైటింగ్ కోసం రూ.1.04 కోట్లతో నిర్మించనున్న రహదారికి శంకుస్థాపన చేశారు. అనంతరం బేతంపూడి స్టేజీ ఆర్అండ్బీ రోడ్డు నుంచి నర్సాయిగూడెం వరకు రూ.1.05 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. తరువాత టేకులపల్లి బోడు రోడ్డు సెంటర్లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసంక అనేక పథకాలు అమలవుతున్నాయన్నారు. ఎమ్మెల్యే హరిప్రియ, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎంపీపీ రాధ, సర్పంచులు సరిత, ప్రియాంక, బాబు, ఉపేందర్, ఎంపీటీసీ అప్పారావు, శాంతకుమారి, బాలకృష్ణ, పూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, ఇల్లెందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరిసింగ్‌నాయక్, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ డీవీ, రైతుబంధు సమితి సభ్యులు మాధవరావు, శ్యాంబాబు, బేతంపూడి సొసైటీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాసచౌదరి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కంభంపాటి చంద్రశేఖర్‌రావు, కార్యదర్శి రామ తదితరులు పాల్గొన్నారు.