
జూలూరుపాడు, నవంబర్ 11: జూలూరుపాడు మండలంలోని కాకర్ల గ్రామాన్ని ఆర్టీసీ కొత్తగూడెం డీఎం వెంకటేశ్వరబాబుతో గురువారం సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. కాకర్ల గ్రామానికి ఆర్టీసీ బస్సు నడపాలంటూ గ్రామ యువకుడు చెవుల బాలరాజు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ను ట్విట్టర్లో కోరిన విషయం విదితమే. దీంతో స్పందించిన సజ్జనార్ రూట్‌మ్యాప్ పరిశీలించి గ్రామానికి బస్సు సర్వీసు నడపాలని డిపో మేనేజర్‌కి రీ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో డీఎంతోపాటు సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మాంచానాయక్, కంట్రోలర్ జాకమ్ గురువారం ర్యూట్‌మ్యాప్ పరిశీలించారు. కాకర్ల గ్రామానికి వచ్చి గ్రామస్తులు, వివిధ పార్టీల నాయకులతో మాట్లాడారు. వారం రోజుల్లో బస్సు సర్వీసును ప్రారంభిస్తామని తెలిపారు.