
కార్యకర్తలకు అండగా ఉంటాం
అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి..
ఎమ్మెల్సీ తాతా మధు
పిండిప్రోలులో టీఆర్ఎస్లోకి భారీగా చేరికలు
తిరుమలాయపాలెం, జనవరి 11: మండలంలోని పిండిప్రోలులో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఎం, కాంగ్రెస్ పార్టీల నుంచి సుమారు 30 కుటుంబాల వారు ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఖమ్మంలోని తాతా మధు నివాసం వద్ద మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నుంచి వచ్చిన షేక్ సలీం, అఫ్జల్, పిడతల రవీందర్, కత్తుల రాజు, కొండమీది రమేశ్, పీరాల వెంకన్న, గుర్రం రాజు, పాలవాయి నాగన్న, కొండమీది వెంకన్న, రాయల వీరస్వామి, కత్తుల సురేశ్, రాజు, పాలమాల మహేశ్, సామేల్, గాదె రాము, పసలాది రమేశ్, భాజ క్రాంతికుమార్, రేపాకుల నరేశ్, గోకినపల్లి ప్రసాద్ తదితరులకు తాతా మధు గులాబీ కండువాలు కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులయ్యే ఆయా పార్టీల బాధ్యులు టీఆర్ఎస్లో చేరుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల అభివృద్ధికీ కృషి చేస్తున్నట్లు వివరించారు. తన స్వగ్రామంలోని వివిధ పార్టీల వారు తమపై నమ్మకంతో టీఆర్ఎస్లో చేరడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. పిండిప్రోలు టీఆర్ఎస్ నాయకులు సీహెచ్ రాజు, పీ.శేఖర్, ఆర్.రాజు, డీ.శ్రీను తదితరులు పాల్గొన్నారు.