
తెలంగాణ విషయంలో కేంద్రానిది ద్వంద్వ వైఖరి
రేపు జాతీయ రహదారి దిగ్బంధం: ఎమ్మెల్యే కందాళ
కూసుమంచి, నవంబర్ 10: యాసంగి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందేనని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని ఆరోపించారు. ఇందుకు నిరసనగా శుక్రవారం ధర్నా, జాతీయ రహదారి దిగ్బంధం కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. వీటిని విజయవతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కూసుమంచిలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కోడ్ ఉన్నందున నిబంధనల మేరకు ధర్నా జరుపుతామని, అందుకు అనుమతి తీసుకున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తున్నా తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి రైతులకు అండగా ఉంటోందని స్పష్టం చేశారు. అన్నదాతల పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో ఉందన్నారు.
పాత కాలువ సిల్టు తీయిస్తాం..
పాలేరు పాత కాలువ షట్టర్ల లీకులకు మరమ్మతులు చేయిస్తామని, పాత కాలువలోని సిల్టు తీయిస్తామని ఎమ్మెల్యే కందాళ తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు చాట్ల పరశురాం, బెల్లం వేణు, ఉన్నం బ్రహ్మయ్య, యండపల్లి వరప్రసాద్, బానోత్ శ్రీనివాస్, బోడా మంగీలాల్, వజ్జా రమ్య, ఇంటూరి శేఖర్, నాగుబండి శ్రీనివాస్, చావా శివరామకృష్ణ, శాఖమూరి రమేశ్, వెంకన్న, ఆసిఫ్, మల్లీడి వెంకటేశ్వరరావు, వజ్జా శ్రీను తదితరులు పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే కందాళ తన కార్యాలయంలో పంపిణీ చేశారు.