
ఉమ్మడి జిల్లాలో 21 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
హాజరుకానున్న 3,242 మంది విద్యార్థులు..
ఉమ్మడి ఖమ్మం, ములుగు జిల్లాల విద్యార్థులకూ పరీక్ష
కూసుమంచి, ఆగస్టు 10 : పాలేరు జవహర్ నవోదయ విద్యాలయంలో 2021-22 విద్యా సంవత్సరానికిగాను 6వ తరగతిలో చేరేందుకు బుధవారం ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు ములుగు జిల్లా విద్యార్థులు 3,242 మంది పరీక్ష రాయనున్నారు. 21 పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యాలయం ప్రిన్స్‌పాల్ శోభనవల్లి తెలిపారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. విద్యార్థులు గంట ముందు పరీక్ష హాల్‌కు చేరుకోవాలని పేర్కొన్నారు.
కేటాయించిన కేంద్రాలు,హాల్‌టికెట్ నెంబర్లు..
విద్యార్థులకు 21 పరీక్షా కేంద్రాలు కేటాయించారు. జడ్పీఎస్ఎస్ -బి అశ్వారావుపేటలో 3389 949 నుంచి 3390068 నెంబర్ వరకు 120 విద్యార్థులకు కేటాయించారు. జడ్పీఎస్ఎస్ -జీ అశ్వారావుపేట 3390069 నుంచి 3390 159 వరకు 91 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. ఎన్ఎస్ఎం జడ్పీఎస్ఎస్ భద్రాచలం 3390160 నుంచి 3390279 వరకు 120 మంది, జీహెచ్ఎస్ భద్రాచలం 3390280 నుంచి 3390379 వరకు 100 మంది. జీహెచ్ఎస్ బూర్గంపాడ్ 3390380 నుంచి 3390487 వరకు 108 మంది విద్యార్థులు. ప్రభుత్వ హైస్కూల్ సత్తుపల్లి 3390488 నుంచి 339 0643 వరకు 156 మంది విద్యార్థులు, జడ్పీఎస్ఎస్ బాలికల పాఠశాల సత్తుపల్లి 3390644 నుంచి 3390795 వరకు 152 విద్యార్థులు, ప్రభుత్వ బాలికా పాఠశాల ఖమ్మంలో 3390 796 నుంచి 3390975 వరకు 180 మంది విద్యార్థులు. గౌట్ హైస్కూల్ గాంధీనగర్ ఖమ్మం లో 3390976 నుంచి 3391179 వరకు 204 విద్యార్థులు. జీహెచ్ఎస్ నయాబజార్ కాల్వొడ్డు ఖమ్మం 3391180 నుంచి 3391323 వరకు 144 విద్యార్థులు నిర్మల్ హృదయ్ స్కూల్ ఎన్ఎస్పీ క్యాంపు ఖమ్మం 3391324 నుంచి 3391563 వరకు 240 మంది విద్యార్థులు. హాంట్ఫోర్టు ప్రకాశ్‌నగర్ ఖమ్మంలో 3391564 నుంచి 3391803 వరకు 240 మంది విద్యార్థులు. గౌట్ హైస్కూల్ ఎన్ఎస్ కెనాల్ ఖమ్మంలో 3391804 నుంచి 3391973 వరకు 170 మంది విద్యార్థులు. సెంట్‌మేరీస్ హైస్కూల్ కొత్తగూడెంలో 3391 974 నుంచి 3392201 వరకు 228 మంది విద్యార్థులకు, సింగరేణి హైస్కూల్ కొత్తగూడెంలో 3392202 నుంచి 3392389 వరకు 188 మంది విద్యార్థులు, టీవీఎం జీహెచ్ఎస్ మధిరలో 3392390 నుంచి 3392539 వరకు 150 మంది విద్యార్థులు, జీహెచ్ఎస్ రిక్కాబజార్ ఖమ్మంలో 3392540 నుంచి 3392683 వరకు 144 మంది, జీహెచ్ఎస్ శాంతి నగర్ ఖమ్మంలో 3392684 నుంచి 3392820 వరకు 137 విద్యార్థులు జడ్పీహెచ్ఎస్ వెంకటాపురం ములుగు జిల్లాలో 3392821 నుంచి 3392 891 వరకు 71 మంది విద్యార్థులు. జీహెచ్ఎస్ జేబీఎస్ ఇల్లెందు 3392892 నుంచి 3393011 వరకు 120 మంది విద్యార్థులు. సింగరేణి హైస్కూల్ ఇల్లెందు 3393012 నుంచి 3393 190 వరకు 179 విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు.