మధిర, ఏప్రిల్ 09 : మధిరలో నూతనంగా నిర్మించిన వంద పడకల ప్రభుత్వ ఆస్పత్రిని వెంటనే ప్రారంభించాలని బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వర్రావు అన్నారు. బుధవారం వంద పడకల హాస్పటల్ ఎదుట బీజేపీ పట్టణాధ్యక్షుడు శివరాజు సుమంత్ ఆధ్వర్యంలో నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఏలూరి నాగేశ్వర్రావు మాట్లాడుతూ… అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వైద్యం కోసం ఖమ్మం వెళ్లాల్సి వస్తుందన్నారు. అన్ని సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఆస్పత్రిని ఇంతవరకు ప్రారంభించకపోవడం బాధాకరమన్నారు.
ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు నిర్మించిన ఆస్పత్రి ప్రారంభానికి మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఎందుకు చొరవ తీసుకోవడం లేదో ప్రజలకు అర్ధం కావడం లేదన్నారు. వెంటనే వంద పడకల హాస్పిటల్‌ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి చిలివేరు సాంబశివరావు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కుంచం కృష్ణారావు, మండల అధ్యక్షుడు గుండా శేఖర్ రెడ్డి, పాపట్ల రమేశ్, సీనియర్ నాయకుడు గడ్డం శ్రీహరి, జిల్లా నాయకులు అనగాని రామారావు, కోరిపల్లి శ్రీను, బాడిశా అర్జునరావు, గరిడేపల్లి వేణు, దినకర్, గోపి, రమేశ్, జిల్లేపల్లి చంటి, దేశినేని పాలెం, బ్రహ్మం పాల్గొన్నారు.