ఖమ్మం: ఖమ్మం (Khammam) ఎస్ఐ మార్కెట్కు మిర్చి పంట పోటెత్తింది. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో సోమవారం తెల్లవారేసరికి ఖమ్మం జిల్లా రైతులతో పాటు సూర్యపేట, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్, ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాల నుంచి రైతులు రికార్డు స్థాయిలో లక్ష బస్తాలను మార్కెట్కు తీసుకువచ్చారు. దీంతో మిర్చి మార్కెట్ ఎర్ర బంగారంతో నిండిపోయింది. ఉదయం 7.30 గంటలకు జరిగిన జెండా పాటలో గరిష్ట ధర క్వింటాల్ రూ.14000 పలికింది.