
శ్రీరామా న్యూరో ఆస్పత్రిని ప్రారంభించిన ఎమ్మెల్యే వనమా
కొత్తగూడెం కల్చరల్, అక్టోబర్ 8 : జిల్లాలోని ఏజెన్సీ ప్రజలకు న్యూరో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని, ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని గణేశ్ టెంపుల్ ఎదురుగా డాక్టర్ రంగారావు ఆస్పత్రి వీధిలో కొత్తగా ఏర్పాటు చేసిన శ్రీరామా న్యూరో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని శుక్రవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు, 33వ వార్డు కౌన్సిలర్ రావి మమతారాంబాబు, కొత్తగూడెం డీఎస్పీ గుడ్ల వెంకటేశ్వరబాబు, ఐఎంఏ అధ్యక్షుడు నాగేశ్వరరావు, సెక్రటరీ రాజశేఖర్, అయ్యప్ప, వైద్యులు రంగారావు, నాగరాజు, ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్ మురళీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.