
ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
సిద్ధారంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
సత్తుపల్లి, నవంబర్ 7 : వానకాలంలో రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, రైతు శ్రేయస్సే ధ్యేయంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. జిల్లాలో తొలిసారిగా ఆదివారం సత్తుపల్లి మండలంలోని సిద్ధారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ మధుసూదన్‌రావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణంతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు వ్యాపారుల చుట్టూ తిరిగి ఇబ్బందులు పడకుండా నేరుగా మద్దతు ధరకే ప్రభుత్వమే కొనుగోలు చేసి వారంరోజుల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమచేసే పద్ధతి ద్వారా రైతులకు అండగా నిలిచిందన్నారు. ఈ ఏడాది ప్రభుత్వ మద్దతు ధర క్వింటా రూ.1,960గా నిర్ణయించిందని, సొసైటీ, ఐకేపీల ద్వారా గ్రామగ్రామాన కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు నాణ్యమైన, తేమశాతం లేకుండా ధాన్యాన్ని తీసుకురావాలని కోరారు. డిసెంబర్ నుంచి పామాయిల్ రైతులకు మొక్కలు పంపిణీ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, డీసీవో విజయకుమారి, ఆర్డీవో సూర్యనారాయణ, తహసీల్దార్ మీనన్, డీటీ రఘురాథోడ్, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్రావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్లు చల్లగుళ్ల కృష్ణయ్య, గొర్ల సంజీవరెడ్డి, వెల్ది జగన్మోహన్రావు, గాదె సత్యం, సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీల అధ్యక్షులు, సీఈవోలు పాల్గొన్నారు.
18మంది నిరుపేదలకు 30కుంటల స్థలం వితరణ
సత్తుపల్లి రూరల్, నవంబర్ 7 : వేంసూరు మండలం కుంచపర్తికి చెందిన హైకోర్టు న్యాయవాది ఆరే వెంకటేశ్వరరావు సత్తుపల్లి మండలం కాకర్లపల్లిలో తనకు ఉన్న 30 కుంటల ఇండ్ల స్థలాన్ని 18మంది నిరుపేదలకు వితరణగా అందజేశారు. ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చేతులమీదుగా స్థలానికి సంబంధించిన పొజిషన్ సర్టిఫికెట్లను ఆదివారం వారికి అందజేశారు. సుమారు రూ.కోటి విలువైన స్థలాన్ని పేదలకు ఇచ్చిన వెంకటేశ్వరరావును అభినందించారు. కార్యక్రమంలో సర్పంచ్ కంచర్ల రమాదేవి నాగేశ్వరరావు, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, వైస్ చైర్మన్ ఏగోటి పెద్దిరాజు, ఎంపీపీ దొడ్డా హైమావతి శంకర్రావు, టీఆర్ఎస్ గ్రామకమిటీ అధ్యక్షుడు దేవరపల్లి సత్యనారాయణ, మాజీ ఎంపీపీ చల్లారి వెంకటేశ్వరరావు, గ్రామస్తులు, నిరుపేదలు పాల్గొన్నారు.