
వైరా, నవంబర్ 5: అనారోగ్య బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటూ మంజూరు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కులను వైరా ఎమ్మెల్యే రాములునాయక్ లబ్ధిదారుల గడప గడపకూ వెళ్లి శుక్రవారం పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాల చెక్కులను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా అందించేలా ‘గడప గడపకూ రాములన్న’ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాములునాయక్ శ్రీకారం చుట్టారు. ఈ చెక్కులు పంపిణీ చేసేందుకు వైరా మండలంలోని పలు గ్రామాల్లో ఎమ్మెల్యే రాములునాయక్ విస్తృతంగా పర్యటించారు. మొత్తం 14 మంది లబ్ధిదారులకు రూ.5.39 లక్షల విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్య బాధితులకు సీఎంఆర్ఎఫ్ అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ వైస్‌చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, ఏఎంసీ చైర్మన్ గుమ్మా రోశయ్య, జిల్లా పరిషత్ కోఆప్షన్‌సభ్యుడు షేక్ లాల్‌మహ్మద్, టీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు బాణాల వెంకటేశ్వర్లు, పసుపులేటి మోహన్‌రావు, తుమ్మల జాన్‌పాపయ్య, ఇటికాల మురళి, బుద్దా సురేశ్, పెద్దవీరభద్రం, ఎంపీటీసీ బూరుగు సంజీవరావు, కాపా మురళీకృష్ణ, దార్న రాజశేఖర్, పారుపల్లి కృష్ణారావు, బీడీకే రత్నం తదితరులు పాల్గొన్నారు.