
సత్తుపల్లి నియోజకవర్గానికి రూ.5 కోట్ల అభివృద్ధి నిధులు
జనవరిలో ఆసుపత్రి, కాలేజీ నూతన భవనాల పనులు ప్రారంభం
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
ఇంటింటికీ వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ
త్తుపల్లి, నవంబర్ 5: నిరుపేదల ఆరోగ్య రక్షణే సీఎంఆర్ఎఫ్ ధ్యేయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ అత్యవసరంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఆదుకుంటున్నదని అన్నారు. సత్తుపల్లి నియోజకవర్గంలో 266 మందికి మంజూరైన సుమారు రూ.1.50 కోట్ల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. సత్తుపల్లిలో లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి వాటిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిగిలిన మండలాల్లో ఆదివారం నుంచి ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేస్తామని చెప్పారు. అనంతరం నియోజకవర్గవ్యాప్తంగా మంజూరైన 150 కల్యాణలక్ష్మి చెక్కులను కూడా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సారెతో కలిపి పంపిణీ చేస్తామన్నారు.
రూ.5 కోట్ల అభివృద్ధి నిధులు
పట్టణంలోని చల్లగుళ్ల నర్సింహారావు నివాసంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సండ్ర మాట్లాడారు. సత్తుపల్లికి మంజూరైన నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవనం, జూనియర్ కళాశాల భవనం పనులను జనవరిలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం రూ.5 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలో భాగంగా రూ.30 కోట్ల నిధుల కోసం ప్రతిపాదనలు పంపామన్నారు. రూ.20 కోట్ల సింగరేణి మినరల్ డెవలప్మెంట్ ఫండ్‌ను ఎస్సీ, ఎస్టీ వాడల్లో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి ఖర్చు చేస్తామన్నారు. మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రఫీ, అంకమరాజు, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్ గాదె సత్యం, చల్లగుళ్ల నర్సింహారావు, మట్టా ప్రసాద్, వీరపనేని రాధికాబాబి, నడ్డి జమలమ్మ, ఆనందరావు, మందపాటి పద్మజ్యోతి, రఘు, చాంద్‌పాషా, ప్రకాశ్‌రావు, మిద్దె శ్రీను, పెద్దిరాజు, నాగేశ్వరరావు, మధు, టోపీ శ్రీను, పవన్ పాల్గొన్నారు.