
కేసీఆర్ నాయకత్వంలో అగ్రగామిగా రాష్ట్రం
తెలంగాణలో జన్మించడాన్ని అదృష్టంగా భావించాలి
ఖమ్మం ఎంపీ నామా
లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
ఖమ్మం, అక్టోబర్ 4: అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శమని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదర్శవంతమైన తెలంగాణలో జన్మించడాన్ని మనం అదృష్టంగా భావించాలని అన్నారు. నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుతో కలిసి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలుస్తోందని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తే దేశమే ఆశ్చర్యపోతోందని అన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అహర్నిశలూ కృషి చేస్తున్నారని అన్నారు. రానున్న రోజుల్లో ఏ ఎన్నికలు జరిగినా గెలుపు గులాబీ పార్టీదేనని స్పష్టం చేశారు. అశ్వారావుపేట నియోజకవర్గంతోపాటు వైరా, కొణిజర్ల మండలాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. టీఆర్ఎస్ నాయకురాలు మద్దినేని స్వర్ణకుమారి, ఆయా మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు సోయం ప్రసాద్, బాణోతు పార్వతి, జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, పైడి వెంకటేశ్వర్లు, దొడ్డాకుల రాజేశ్వరరావు, బండి పుల్లారావు, మోరంపూడి అప్పారావు, దారా వెంకటేశ్వర్లు, బాణాల వెంకటేశ్వరరావు, చిరంజీవి, నల్లమోతుల వెంకటేశ్వరరావు, రసూల్, వెంకటేశ్వర్లు, ఏడుకొండలు, రమేశ్, కనకమేడల సత్యనారాయణ, చిత్తారు సింహాద్రి, పాల్వంచ రాజేశ్, చీకటి రాంబాబు, తాళ్లూరి హరీశ్ తదితరులు పాల్గొన్నారు.