
భద్రాద్రికొత్తగూడెం, జనవరి 4 (నమస్తే తెలంగాణ): కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా కుటుంబంపై ఆరోపణలు సరికాదని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు అన్నారు. కొత్తగూడెంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, నాలుగు మండలాల ఎంపీపీలు, ఇతర ప్రజాప్రతినిధులు మాట్లాడారు. పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబం తమ కుటుంబ సమస్య పరిష్కారం కోసం వనమా రాఘవ ఇంటికి వచ్చారని, ఆ సమయంలో తల్లిని మంచిగా చూసుకోవాలని మాత్రమే ఆయన చెప్పారని అన్నారు. రాజమండ్రిలో ఆన్లైన్లో పెట్టుబడి పెట్టి అప్పులు పాలైన రామకృష్ణ.. పాల్వంచలో ఆత్మహత్య చేసుకుంటే దానిని రాజకీయం చేసి వనమా కుటుంబంపై ఆరోపణలు చేయడం ఎంత వరకు సమంజసమని అన్నారు. టీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు ఆళ్ల మురళి, సోమిరెడ్డి, రజాక్, మండే వీరహనుమంతురావు, అన్వర్‌పాషా, రాంబాబు, దామోదర్, సోనా, విజయలక్ష్మి, శాంతి, తూము చౌదరి, సుందర్, కొట్టి వెంకటేశ్వర్లు, కొల్లు పద్మ తదితరులు పాల్గొన్నారు.
ప్రెస్‌మీట్‌ను అడ్డుకున్న పోలీసులు
కొవిడ్ నిబంధనలు పాటించకుండా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి మాట్లాడుతున్న టీఆర్ఎస్ నాయకులను స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. వారిని సీఐ బత్తుల సత్యనారాయణ అదుపులోకి తీసుకున్నారు.