
ఖమ్మం వ్యవసాయం, జనవరి 4: తెల్లబంగారం ధర మరోసారి రికార్డు స్థాయిలో పెరిగింది. మంగళవారం రైతులు ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు సుమారు 5 వేల పత్తి బస్తాలను తీసుకొచ్చారు. అనంతరం జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం (ఈ-బిడ్డింగ్) ద్వారా జరిగిన ప్రక్రియలో ఖరీదు దారులు కొనుగోలుకు పోటీపడ్డారు. దీంతో మరోసారి ఖమ్మం మార్కెట్లో రికార్డు స్థాయి ధర నమోదైంది. క్విం టాకు గరిష్ఠ ధర రూ.9,700, మధ్య ధర రూ.9,200, కనిష్ఠ ధర రూ.8,500 చొప్పున బిడ్ చేసి వ్యాపారులు పత్తిని కొనుగోలు చేశారు.