
ఖమ్మం, నవంబర్ 3 : నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉన్నదని జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. ఖమ్మం నగరం జూబ్లీపురలోని ఎంపీ నామా నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంలో బుధవారం మధిర నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన 60మందికి రూ.27.71 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) చెకులను అందజేశారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న జడ్పీ చైర్మన్ మాట్లాడారు. ఎంపీ నామా ప్రత్యేక చొరవ తీసుకుని లబ్ధిదారులకు ఎకువ మొత్తంలో సీఎంఆర్ఎఫ్ చెకులు అందేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ఎఫ్ ద్వారా అత్యధిక మంది లబ్ధి పొందిన నియోజకవర్గాల్లో మధిర నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉందన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ముదిగొండ ఎంపీపీ హరిప్రసాద్, చింతకాని ఎంపీపీ పూర్ణయ్య పాల్గొన్నారు.