
ఖమ్మం రూరల్, అక్టోబర్ 2: గాంధీజి అహింసా పద్ధతులు ఖైదీలందరూ పాటించాలని, జైలులో ఉన్నప్పుడే చేసిన తప్పులను సంస్కరించుకొని బయటకు వచ్చిన తరువాత సమాజంలో గౌరవంగా జీవించాలని జిల్లా సెషన్స్ జడ్జి హరికృష్ణ భూపతి అన్నారు. గాంధీ జయంతి సందర్భంగా శనివారం జిల్లా జైళులో ఖైదీల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సెషన్స్ జడ్జి మాట్లాడుతూ.. క్షణికావాశేంలో చేసే తప్పుల వలన జీవితకాలం అంతా ఇబ్బందులు పడాల్సి వస్తున్నదన్నారు. అదనపు జడ్జి చంద్రశేఖర్ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి మనిషి జీవితంలో అహింసా పద్ధతులు అలవర్చుకుంటే సమాజంలో ఎటువంటి సమస్యలు ఉండవన్నారు. లీగల్ సర్వీసెస్ సెక్రెటరీ జావీద్ పాషా మాట్లాడుతూ ఖైదీలకు న్యాయ సహాయం కావాలనుకునేవారు తమను సంప్రదిస్తే ఉచిత న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి శ్రీధర్, జిల్లా జైలు వార్షిక నివేదిక, ఖైదీలకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను వివరించారు. ఖైదీల సంక్షేమానికి జైళ్లశాఖ అనేక కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా సబ్ జైళ్ల అధికారి జి.వెంకటేశ్వర్లు, మహిళా జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ అమరావతి, జైలర్లు విజయ్డేని, సక్రు, కృష్ణకాంత్, సైదులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.