
భద్రాచలం, సెప్టెంబర్1: ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలానికి గురువారం శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి రానున్నారు. ఇక్కడ రెండ్రోజుల పాటు జరిగే పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు బుధవారం జీయర్ మఠం బాధ్యుడు గట్టు వెంకటాచార్య ఓ ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం ఉదయం 8గంటలకు జీయర్ మఠంలో తీర్థ గోష్ఠి, 9.15 గంటలకు జనరేటర్ ప్రారంభం, 9.30 గంటలకు భద్రాద్రి రామయ్య సేవ, 10 గంటలకు శ్రీమద్భాగవత సప్తాహంలో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారని ప్రకటనలో తెలిపారు. 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు మంత్రోపదేశాలు, సాయంత్రం 4 గంటలకు దేవస్థాన వైదిక- కార్యాలయ ఉద్యోగులతో ఆత్మీయ సమావేశం, 5.30 గంటలకు శ్రీ విష్ణు సహస్ర నామ పారాయణం, సాయంత్రం 6 గంటల నుంచి సమతామూర్తి సందేశ సభ అనంతరం అభినవ దాశరథ శతకం ఆవిష్కరణ కార్యక్రమం. 4వ తేదీన ఉదయం 8.30 గంటలకు భద్రాద్రి రాముని సేవ, 9 గంటలకు భద్రగిరి ప్రదక్షిణ, 10గంటల నుంచి 1 గంట వరకు మాతృశ్రీ సవనం, 3 గంటలకు వికాస తరంగిణి, జీయర్ మఠం సభ్యులతో ఆత్మీయ సమావేశం, 5 గంటలకు జీయర్ స్వామి భద్రాచలం నుంచి బయల్దేరతారని ఆయన తెలిపారు.